: జయలలితతో 32 ఏళ్లు కలిసి ఉన్నా.. ఇటువంటి పన్నీరు సెల్వాలను వెయ్యి మందిని చూశా: శశికళ దూకుడు
తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తోన్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ.. పన్నీర్ సెల్వంపై విమర్శల జల్లు కురిపిస్తూ దూకుడు కనబరుస్తున్నారు. అమ్మ జయలలితతో తాను 33 ఏళ్లు కలిసి ఉన్నానని, ఆ సమయంలో తాను వెయ్యి మంది పన్నీర్ సెల్వం లాంటి వారిని చూశానని పేర్కొన్నారు. ఎవ్వరికీ భయపడకుండా ముందుకు వెళతానని చెప్పారు. పన్నీర్ సెల్వం గురించి ఎమ్మెల్యేలకు నిజాలు తెలియాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తనను పిలవాల్సిందిగా గవర్నర్‌కు కూడా ఒక రోజు గడువు ఇస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు పన్నీర్ వైపు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 8 మందే కావడంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. ప్రస్తుతం తమిళనాడు సచివాలయంలో రాష్ట్ర పరిస్థితులపై ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ భేటీలో పలు కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం.