: దూరదర్శన్ లో మళ్లీ ప్రసారం కానున్న షారూక్ ‘సర్కస్’
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ అభిమానులకు ‘గుడ్ న్యూస్’ చెబుతోంది ప్రభుత్వ టీవీ ఛానెల్ దూరదర్శన్. షారూక్ నటనకు పునాది ‘బుల్లితెర’పైనే పడింది. 1980ల్లో షారూక్ నటించిన టీవీ సీరియల్ ‘సర్కస్’ ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ సీరియల్ ను మళ్లీ ప్రసారం చేయనున్నట్లు దూరదర్శన్ నేషనల్ (డీడీ నేషనల్) తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ప్రకటన చేసింది. ఈ నెల 19వ తేదీ రాత్రి 8 గంటలకు ‘సర్కస్’ సీరియల్ ప్రసారం ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. కాగా, ఈ సీరియల్ కు అజీజ్ మీర్జా, కుందన్ షా దర్శకత్వం వహించారు. కాగా, షారూక్ మొదట నటించిన టీవీ సీరియల్ ‘ఫౌజీ’. అనంతరం నటించిన సీరియల్ ‘సర్కస్’లో షారూక్ తన నటనా కౌశలాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత ‘దీవానా’ చిత్రం ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టిన బాద్ షా ప్రేక్షకుల మన్ననలు పొందాడు.