: కాసేపట్లో పన్నీర్ సెల్వంతో భేటీ కానున్న స్టాలిన్
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ భేటీ కానున్నారు. ఈ మధ్యాహ్నం స్టాలిన్ సెక్రటేరియట్ కు వెళ్లి, అక్కడ కాసేపు గడిపి వచ్చారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత పన్నీర్ సెల్వం సచివాలయానికి చేరుకున్నారు. దీంతో, ఇద్దరూ కలిసే అవకాశం కుదరలేదు. ఈ నేపథ్యంలో, వీరిద్దరూ కాసేపట్లో కలుసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వమే కొనసాగాలని స్టాలిన్ కోరుతున్నారు. శశికళ ముఖ్యమంత్రి అయితే ఆమె బలపడుతుందనే అనుమానాలు స్టాలిన్ కు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, పన్నీర్ కు మద్దతు పలికేందుకు స్టాలిన్ సంసిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే, శశి వర్గం నుంచి కొంత మంది ఎమ్మెల్యేలనయినా పన్నీర్ లాగాల్సి ఉంటుంది.