: జల్లికట్టు తరహాలోనే.. కంబళ బిల్లుకు ఆమోదం తెలిపిన కర్ణాటక సర్కార్


కర్ణాటకలోని కరావళి ప్రాంత సాంస్కృతిక క్రీడ కంబళను నిర్వహించుకునేలా... ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించుకునే బిల్లుకు ఈ రోజు అసెంబ్లీలో ఆమోదముద్ర పడింది. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుపై చర్చించి పాస్ చేశారు. దీని ప్రకారం... జీవహింస నిరోధక చట్టాల్లో సవరణలు చేస్తారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. జల్లికట్టు కోసం తమిళులు పోరాడిన స్పూర్తితో కన్నడిగులు కూడా పెద్ద సంఖ్యలో కంబళ కోసం ఉద్యమించారు. దీంతో, కంబళ నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగిస్తామని ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఇచ్చిన మాట మేరకు ఈ రోజు బిల్ పాస్ చేసింది. 

  • Loading...

More Telugu News