: సంయమనం పాటించండి.. గవర్నర్ నుంచి తీపికబురు వస్తుంది: కార్యకర్తలతో శశికళ
ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకే కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ అన్నారు. ఈ రోజు ఆమె పోయెస్‌గార్డెన్‌లోని తన నివాసంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పోలీసులకు కార్యకర్తలు అవాంతరాలు కలిగించవద్దని ఆమె సూచించారు. పన్నీర్ సెల్వం పదవులను అనుభవించి పార్టీకి ద్రోహం చేశారని ఆమె నిప్పులు చెరిగారు. గవర్నర్ నుంచి త్వరలోనే తీపికబురు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. పన్నీర్ సెల్వం అసలు స్వరూపం ఇప్పుడు బయటపడిందని అన్నారు. త్వరలోనే తాము విజయం సాధిస్తామని ఉద్ఘాటించారు.