: పార్టీని చీల్చడానికి కుట్రలు జరుగుతున్నాయని అమ్మ చనిపోయినప్పుడే తెలిసింది: శశికళ
జయలలిత అంతిమ సంస్కారాల్లో తాను పాల్గొంటున్నప్పుడే కొందరు కుట్రలు చేయడం ప్రారంభించారని అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ అన్నారు. తమ పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులపై ఈ రోజు మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా పార్టీని విడదీయలేరని అన్నారు. అన్నాడీఎంకే పార్టీని చీల్చడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాను సాగనివ్వబోనని చెప్పారు. పార్టీ పగ్గాలు చేపట్టాలని తనకు పన్నీర్ సెల్వమే చెప్పారని, ఇప్పుడు మాత్రం ఎదురు తిరుగుతున్నారని ఆమె అన్నారు.
పార్టీని చీల్చడానికి కుట్రలు జరుగుతున్నాయని అమ్మ చనిపోయినప్పుడే తెలిసిందని ఆమె అన్నారు. పన్నీర్ సెల్వం పార్టీకి ఎప్పుడూ విధేయుడిగా ఉండలేదని చెప్పారు. పన్నీర్ సెల్వం విశ్వాస ఘాతకుడని అన్నారు. ఇతర పార్టీలతో చేతులు కలిపి పన్నీర్ కుట్రలు పన్నుతున్నారని ఆమె అన్నారు. పన్నీర్ సెల్వం అమ్మకు నమ్మక ద్రోహం చేశారని అన్నారు. సీఎం అయ్యేందుకు సరిపడే మద్దతు తనకు ఉందని చెప్పారు.