: వ్యాపం స్కాంలో సుప్రీం తీర్పు: 600 మంది విద్యార్థులపై ప్రభావం
మధ్యప్రదేశ్‌లో వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకున్న విద్యార్థులు అక్రమ పద్ధతుల్లో వ్యాపమ్ ప్రి-మెడికల్ పరీక్షను రాసిన విషయం తెలిసిందే. ముడుపులు చెల్లించి భారీ సంఖ్యలో వైద్య సీట్లు పొందారన్న ఆరోపణల నేపథ్యంలో సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. 2008 నుంచి 2012 మధ్య ఎంబీబీఎస్‌లో చేరినవారి అడ్మిషన్లు చెల్లుబాటు కావని పేర్కొని విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఈ తీర్పుతో దాదాపు 600 మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది. అంతేగాక, విద్యార్థులు వేసిన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో పలువురు వైద్య విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి జైలులో వేసి విచారణ కొనసాగించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ కూడా దర్యాప్తు జరిపింది. అన్ని అంశాలను పరిశీలించిన న్యాయస్థానం ఆ మేరకు తీర్పునిచ్చింది.