: సోషల్ మీడియాకు వచ్చిన శశికళ... ఎవరు అడ్డుకున్నా తానే సీఎంనని ట్వీట్
ఓ వైపు పన్నీర్ సెల్వం పేరు సామాజిక మాధ్యమాల్లో మోగిపోతుంటే, తాను కూడా టెక్నాలజీని వాడుకోవాలని భావించిన శశికళ, ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను చెప్పాలని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆమె ఓ ట్వీట్ ను పెడుతూ, ఎవరు అడ్డుపడ్డా తానే సీఎంనని వ్యాఖ్యానించారు. తనను ఎవరూ భయపెట్టలేరని, ఈ పోరాటంలో విజయం సాధిస్తానన్న నమ్మకముందని అన్నారు. ఎవరూ తనకు అడ్డంకులు సృష్టించలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షోభానికి బీజేపీ, డీఎంకేలే కారణమని ఆమె ఆరోపించారు. వారి సూచనతోనే గవర్నర్ తన నిర్ణయాన్ని ఆలస్యం చేస్తున్నారని తెలిపారు.