: కొత్తగా జియో సిమ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? '6' నంబర్ సిరీస్ వస్తోంది
జియో యూజర్ల సంఖ్యను శరవేగంగా పెంచుకుంటూ పోతున్న రిలయన్స్ కు కొత్తగా '6' అంకెతో మొదలయ్యే సెల్ ఫోన్ నంబర్ సిరీస్ ను ఇచ్చేందుకు డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం) అనుమతి లభించింది. కాగా, ప్రస్తుతం కొన్ని సర్కిళ్లలో మాత్రమే 6తో మొదలయ్యే నంబర్లను కేటాయిస్తామని జియో స్పష్టం చేసింది. రాజస్థాన్ లో 60010 - 60019 ఎంఎస్సీ (మొబైల్ స్విచ్చింగ్ కోడ్), అసోంలో 60020 - 60029, తమిళనాడులో 60030 - 60039 ఎంఎస్సీలో కనెక్షన్లను జారీ చేయనున్నట్టు తెలిపింది. మధ్యప్రదేశ్, గుజరాత్ లో 7 సిరీస్ లో, కోల్ కతా, మహారాష్ట్రల్లో 8 సిరీస్ లో కొత్త నంబర్లు ఇవ్వనున్నట్టు తెలిపింది.