: ఎమ్మెల్యేలు నిర్బంధంలో ఉంటే వారి కుటుంబ సభ్యులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: హైకోర్టు
అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ ఎమ్మెల్యేలను పలు రిసార్టుల్లో అక్రమంగా నిర్బంధించారని వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సదరు ఎమ్మెల్యేల నుంచి వాంగ్మూలాలు సేకరించి న్యాయస్థానానికి సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వాంగ్మూలాలు పరిశీలించి, అధికారుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు పేర్కొంది. కాగా, ఎమ్మెల్యేలు నిర్బంధంలో ఉంటే వారి కుటుంబ సభ్యులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కోర్టు ప్రశ్నించింది.
మరోవైపు తమిళనాడు సచివాలయంలో ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కొనసాగిస్తోన్న సమీక్షలో పోయెస్ గార్డెన్‌పై పలు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.