: ఇక మిగిలింది తోక మాత్రమే... 7 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు విజయానికి మరింత చేరువైంది. 459 పరుగుల కష్టసాధ్యమైన విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఏడుగురు పెవీలియన్ దారి పట్టారు. మహ్మదుల్లా 64, సౌమ్యా సర్కార్ 42 పరుగులు చేసి జట్టును కనీసం డ్రా తీరానికి చేర్చాలని శ్రమించినా, భారత బౌలర్ల ధాటికి వారి శ్రమ వృథా అయింది. మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో అశ్విన్ కు 3, ఇషాంత్, జడేజాలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం బంగ్లా స్కోరు 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు కాగా, బంగ్లా గెలవాలంటే మాత్రం 224 పరుగులు చేయాలి. క్రీజులో టెయిలండర్లు మాత్రమే మిగిలివుండటంతో టీ విరామానికి ముందే మ్యాచ్ ని ముగించాలని భారత్ భావిస్తోంది.