: పోయెస్ గార్డెన్స్ వద్దకు భారీగా తరలివస్తోన్న శశికళ మద్దతుదారులు, కార్యకర్తలు
పోయెస్ గార్డెన్స్ లోని వేద నిలయంలో నివాసం ఉంటున్న అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ వద్దకు ఈ రోజు ఉదయం నుంచి ఆమె మద్దతుదారులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. చిన్నమ్మకు ఎదురుతిరిగిన పన్నీర్ సెల్వం అమ్ముడుపోయారని వారు ఆరోపిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా సీఎం అయ్యే వ్యక్తి శశికళేనని మీడియాతో మాట్లాడుతూ వారు వ్యాఖ్యానించారు. వారందరి వద్ద జయలలిత, శశికళ ఇద్దరూ ఉన్న ఫొటోలు కనపడుతున్నాయి. తమ రాష్ట్ర గవర్నర్ తీరుపట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి తీరు సరికాదని అంటున్నారు. పన్నీర్ సెల్వం వద్ద ఉన్నది కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు.