: పాస్‌పోర్ట్ లేద‌న్న కార‌ణంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విద్యార్థిని మృత‌దేహాన్ని నిలిపేసిన‌ సిబ్బంది


కొన్నిరోజుల క్రితం పోలెండ్‌లో నాగశైలజ అనే విద్యార్థిని అనారోగ‍్యంతో ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆమె కుటుంబసభ‍్యులు మృతదేహాన్ని పోలెండ్‌ నుంచి విమానంలో హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి తీసుకువచ్చారు. కాగా, త‌మ‌ కూతురు మృతి చెంది దుఃఖంతో ఉన్న త‌ల్లిదండ్రుల‌కు అక్క‌డి మ‌రింత బాధ‌క‌లిగే సంఘ‌ట‌న ఎదురైంది. నాగ‌శైల‌జ‌కు పాస్‌పోర్టు లేద‌ని ఆ మృత‌దేహాన్ని ఎయిర్‌పోర్టు వ‌ద్దే నిలిపివేశారు. బంధువులకు అప‍్పగించేందుకు నిరాకరించారు. అయితే, విమాన సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగానే నాగ‌శైల‌జ పాస్ పోర్టు పోయింద‌ని కుటుంబ స‌భ్యులు అంటున్నారు. ఉన్న‌తాధికారులు స్పందించి త‌న కూతురి మృత‌దేహాన్ని అప్ప‌గించాల‌ని వేడుకుంటున్నారు.

  • Loading...

More Telugu News