: మరో రెండు చారిత్రక సినిమాలను తీస్తా: ‘శాతకర్ణి’ దర్శకుడు క్రిష్ ప్రకటన
నందమూరి బాలకృష్ణతో కేవలం 79 రోజుల్లో శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తీసిన దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) ఆ భారీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరో రెండు ఇటువంటి సినిమాలే తీస్తానని ప్రకటించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథను ప్రజలకు తెలియజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాను భవిష్యత్తులో శ్రీకృష్ణదేవరాయలు, గౌతమ బుద్ధుడు లాంటి వారి కథలను కూడా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.