: కిందపడిపోతున్న టోపీని అందుకునే క్రమంలో.. ప్రాణాలు కోల్పోయిన యువతి
ఎస్కలేటర్‌పై ఉన్న ఓ యువతి కిందపడిపోతున్న టోపీని అందుకునే క్రమంలో అదుపుతప్పి ప్రాణాలు కోల్పోయిన ఘటన న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోపల చోటు చేసుకుంది. జెన్నీ సంతోష్ (29) అనే యువతి సుమారు 30 అడుగుల ఎత్తుమీద అక్కడ తన సోదరితో కలిసి ఉంది. ఓ ఎస్కలేటర్‌పై పైకి వెళుతుండగా ఒక్కసారిగా ఆమె సోదరి టోపి కింద పడిపోతుండడంతో దానిని పట్టుకునే ప్రయత్నం చేసింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో పడి నేలకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలపాలయిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే దారిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఓ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తోంది. ఈ సోదరీమణులిద్దరూ ట్రేడ్ సెంటర్ లోపల ఉన్న ఒక పబ్‌లోకి వెళ్లి సరదాగా గడపాలని అనుకున్నారు. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.