: నిజం చెబితే బాలయ్యకు ఇబ్బంది... చెప్పకుంటే అది ద్రోహం... ఇక ఆయనిష్టం: దగ్గుబాటి
దివంగత ఎన్టీ రామారావు జీవిత చరిత్రను చిత్రంగా తీస్తానని బాలకృష్ణ ప్రకటించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలయ్య ఈ ఆలోచనను విరమించుకుంటేనే మంచిదని కూడా సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ జీవితంలో చివరి పేజీలను సరిగ్గా చూపించలేకుంటే, స్వయంగా కన్న తండ్రికి ద్రోహం చేసిన వ్యక్తిగా బాలయ్య అభిమానుల ముందు తలదించుకునే ప్రయత్నం చేసినట్లవుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో జరిగింది జరిగినట్టు చూపిస్తే, చంద్రబాబు ముందు ఆయనకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా జరిగింది జరిగినట్టు చెప్పడం బాలయ్యకు చాలా కష్టమైన విషయమని అన్నారు. బాలయ్యకు తానేమీ సలహాలు ఇవ్వడం లేదని, ఈ ప్రయత్నం సాధ్యం కాదని తాను అభిప్రాయపడుతున్నట్టు వెల్లడించారు.