: తమిళనాడుకు కొత్త చిక్కు... ఆ 35 మందీ ఎక్కడ?


అన్నాడీఎంకేకు మొత్తం 134 మంది ఎమ్మెల్యేలు వున్నారు. వీరిలో ఏడుగురు పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపారు. తమ శిబిరంలో 127 మంది ఉన్నారని శశికళ శిబిరం నేతలు చెబుతున్నప్పటికీ, వారి వద్ద 93 మంది మాత్రమే ఉన్నట్టు అనధికార వర్గాల భోగట్టా. ఇదే నిజమైతే మిగతా 35 మందీ ఎక్కడున్నారు? గత ఐదు రోజులుగా వీరి గురించిన సమాచారం బయటకు వెల్లడి కాలేదు. వీరిలో అత్యధికులు పన్నీర్, శశికళ సామాజిక వర్గమైన దేవర్ కులానికి చెందినవారేనని తెలుస్తోంది. దీంతో వీరు ఎటువైపు నిలుస్తారన్నది సస్పెన్స్ గా ఉంది.

ఇప్పుడు వీరంతా ఎక్కడున్నారన్న విషయమై పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యేలు తమ వైపంటే.. తమ వైపని అటు పన్నీర్ వర్గం, ఇటు శశికళ వర్గం బలగుద్ది మరీ చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు కదిలిన పోలీసులు సైతం వీరిని కనుగొనలేకపోవడంతో, వీరి వాంగ్మూలాలను నమోదు చేయలేదు. ఎమ్మెల్యేల ఆచూకీ తెలియకపోవడం ఇప్పుడు తమిళనాడుకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది.

  • Loading...

More Telugu News