: పవన్ కల్యాణ్ గురించి మాకు బాగా తెలుసు.. ఆయన అన్నీ వదిలేసి రోడ్డుపైకి రావాలి!: పోసాని
పవన్ కల్యాణ్ గురించి తమకు బాగా తెలుసని, దేశం మీద, ప్రజల మీద ఆయనకు నిజంగా ప్రేమ ఉంటే.. అన్నీ వదిలేసి రోడ్డుపైకి రావాలని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,‘పవన్ ఎన్టీఆర్ లా పాదయాత్ర చేయాలి. ఎన్టీఆర్ లా ఊరూరు తిరగాలి. ప్రజలను చైతన్యవంతం చేయాలి. పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఏపీకి తీవ్రమైన అన్యాయం ఏమీ చేయలేదు... ప్రత్యేక హోదా విషయమై ప్రజలను ఆయన ఎందుకు రెచ్చగొట్టడం? చంద్రబాబు వద్దకు పవన్ కల్యాణ్ వెళ్లి ఏపీకి ప్రత్యేక హోదా విషయమై అడిగాడా? అని నేను ప్రశ్నిస్తున్నా.
ఏంటి తప్పు? పవన్ కల్యాణ్ మంచివాడు, ఆనెస్ట్.. క్లీన్ మ్యాన్. ఆయన పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడట్లేదు. సమాజ పరంగా నేను మాట్లాడుతున్నాను.. పద్ధతి గలవాడు. ఆయన పర్సనల్ లైఫ్ కు, రాజకీయాలకు ముడిపెట్టొదు. రాజకీయాల్లోకి రాకముందే పవన్ పై నింద పడకూడదనేది నా కోరిక. ఇంకా పరిపూర్ణమైన రాజకీయాల్లోకి రాకముందే, వాళ్లు తిట్టడం.. వీళ్లు తిట్టుకోవడం వేస్ట్ అంటున్నాను. రాజకీయాల్లోకి క్లియర్ గా రావాలనుకుంటున్నప్పుడు అంతే క్లీన్ గా ఉండాలనేది నా కోరిక. పవన్ కల్యాణ్ అంటే నాకు ఇష్టం. ఈ వన్ ఇయర్, ఆర్నెల్లు.. సినిమాలు పక్కన పెట్టి.. ట్విట్టర్లు పక్కన పెట్టి.. జనసేన పార్టీ కండువా వేసుకుని చంద్రబాబును ఏకి పారేయండి’ అని పోసాని సలహా ఇచ్చారు.