: ‘జల్లికట్టు’లో దారుణం.. ఎనిమిది మంది యువకులు మృతి
తమిళనాడు సంప్రదాయ క్రీడ‘జల్లికట్టు’లో దారుణం జరిగింది. ఎనిమిది మంది యువకులు మృతి చెందారు. కృష్ణ గిరి జిల్లా బలుగూరులో ‘జల్లికట్టు’ నిర్వహించారు. క్రీడలో భాగంగా ఒక ఎద్దును లొంగదీసుకునే క్రమంలో, ఒక్కసారిగా దానిపై యువకులు పడిపోయారు. దీంతో, ఊపిరాడక, బెదిరిపోయిన ఆ ఎద్దు తన ప్రతాపం చూపించింది. రంకెలు వేస్తూ, కొమ్ములు విసరడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరి కొంతమంది గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, తక్షణ చర్యలు చేపట్టాలని, క్రీడను నిలిపివేయాలని ఆదేశించారు.