: సుమిత్రా మహాజన్ నోట తెలుగు తేజాల పేర్లు!


అమరావతిలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సుమిత్రా మహాజన్ తెలుగు తేజాల పేర్లను ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, రియో ఒలింపిక్స్ పతక విజేత పివి సింధు, ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి వంటి ప్రతిభ గల మహిళలు ఉన్నారని తన ప్రసంగంలో పేర్కొన్నారు. అనంతరం, సుమిత్రా మహాజన్ ను ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్, తదితరులు సత్కరించారు.

  • Loading...

More Telugu News