: బలనిరూపణకు సిద్ధంగా ఉన్నాం: శశికళ వర్గం ఎమ్మెల్యేలు


తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తి.. రోజులు గడుస్తున్నా ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయం ఓ కొలిక్కి రాలేదు.. సరికదా, శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే పన్నీర్ సెల్వం వైపు జారుకుంటున్నారు. ఈ తరుణంలో శశికళ వర్గం ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ మాట్లాడుతూ, చిన్నమ్మకు 128 ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఏ క్షణంలోనైనా సరే, బల నిరూపణకు తమ వర్గం సిద్ధంగా ఉందని అన్నారు. తమిళనాడు గవర్నర్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు మద్దతు ఎమ్మెల్యేలను హాజరు పర్చేందుకు శశికళ సిద్ధంగా ఉన్నారని తమిళ్ సెల్వన్ అన్నారు. చిన్నమ్మ వర్గంలోని ఎంపీ వైద్య లింగం మాట్లాడుతూ, ఆమెకు పూర్తి స్థాయి మెజారిటీ ఉందని, తమ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News