: అన్న పిస్టల్ తీసుకుని గురి పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కాలని ఎన్నిసార్లు భావించానో!: కదిలించిన పవన్ కల్యాణ్ ప్రసంగం
జీవితంలో అత్యంత నిరాశా నిస్పృహలకు లోనైన వేళ, ఆత్మహత్య చేసుకుందామని భావించి ఎన్నోమార్లు తన అన్న చిరంజీవి వద్ద ఉండే లైసెన్స్డ్ రివాల్వర్ ను చేతిలోకి తీసుకున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. "మా అన్నయ్య కూడా నటుడే. ఆయన వద్ద లైసెన్స్ ఉన్న రివాల్వర్ ఉండేది. నేను నటుడిని అవ్వాలని ఎన్నడూ అనుకోలేదు. ఓ యోగిగా మారాలని భావించాను. ఏం చేయాలో తెలియక, నేను అనుకునే మార్గంలో ఎలా వెళ్లాలో నిర్ణయించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించాను. అన్నయ్య పిస్టల్ తీసుకుని గురి పెట్టుకుని నన్ను నేను హత్య చేసుకోవాలని ఎన్నోమార్లు ట్రిగ్గర్ నొక్కాలని భావించాను. ఆ సమయంలో అమ్మ, నాన్న ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలా ఉండలేకపోయేవాడిని. అంత బాధ నాలో ఉండేది. ఆ బాధను నా కుటుంబ సభ్యులతో పంచుకున్నాను. వాళ్లు కౌన్సెలింగ్ ఇచ్చిన తరువాత, చదువు మానేసి నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్లాను. కంప్యూటర్స్, యోగా, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. సమాజంలో భాగంగా ఎదుగుతూ వచ్చాను" అని చెప్పారు.