: చిన్నప్పుడు ఎన్ని బాధలు అనుభవించానో: పవన్ కల్యాణ్ భావోద్వేగం
తాను చిన్నప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించానని, ఎన్నో స్కూళ్లు మారానని, తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, ట్రాన్స్ ఫర్ అవుతుంటే, ఆయనతో పాటే తన చదువూ ఎన్నో ఊర్లలో సాగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నేడు హార్వార్డ్ యూనివర్శిటీలో జరుగుతున్న 'ఇండియా కాన్ఫరెన్స్'లో ఆయన ప్రసంగం ప్రారంభమైంది. చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న అనుభవాలను చెబుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఒక్కో తరగతిని ఒక్కో ఊరిలో చదువుకోవాల్సి వచ్చిందని అన్నారు. వర్శిటీ విద్యార్థులతో ముచ్చటిస్తూ, తన చిన్ననాటి అనుభవాలను ఎన్నింటినో ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక్కో ఊరిలో తన చదువు ఎలా సాగిందన్న విషయాన్ని చెబుతూ, ఆయా పాఠశాలల్లో వాతావరణాన్ని, పచ్చదనాన్ని వివరించారు. ఆయన ప్రసంగం కొనసాగుతోంది.