: ప్లేట్ ఫిరాయించిన మంత్రి పాండ్యరాజన్?
ముఖ్యమంత్రి పదవిలో పన్నీర్ సెల్వం కొనసాగాలని కోరుకుంటున్నానని, ఆయనకు తన మద్దతు అని నిన్న ప్రకటించిన తమిళనాడు విద్యా శాఖ మంత్రి పాండ్యరాజన్ మాట మార్చినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ను ఈ రోజు ఉదయం ఆయన కలిశారు. ఈ విషయం తమిళనాట చర్చనీయాంశమైంది. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు, జయలలిత ఆశయాలను కాపాడేందుకు పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతానని నిన్న చెప్పిన పాండ్యరాజన్, ఈ రోజు శశికళను కలవడం వెనుక కథేంటని పలువురు చర్చించుకుంటున్నారు.