: అంధుల టీ-20 ప్రపంచ కప్ విజేత భారత్... ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి చిత్తు
ప్రపంచ కప్ క్రికెట్ పోటీలంటే, ఇండియా జట్టు పాకిస్థాన్ జట్టుపై సునాయాస విజయం సాధిస్తుందని మరోసారి రుజువైంది. వరల్డ్ కప్ సెంటిమెంట్ ను నిలుపుతూ, నేడు జరిగిన అంధుల ప్రపంచకప్ టీ-20 పోటీల్లో భారత జట్టు, చిరకాల ప్రత్యర్థి పాక్ పై సునాయాస విజయం సాధించింది. ఫైనల్ పోరులో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 198 పరుగులకు ఆలౌట్ కాగా, కేవలం 1 వికెట్ కోల్పోయి 199 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ఛేదించి, ట్రోఫీని సగర్వంగా అందుకుంది.