: వంశీరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ


అమెరికాలో తెలుగు విద్యార్థి వంశీరెడ్డి (27) హత్యకు గురైన విషయం తెలిసిందే. వంశీరెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామం. ఈ నేపథ్యంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు వంశీరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. బీజేవైఎం నాయకులు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ సంతాపం వ్యక్తం చేశారు. వంశీరెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేలా తెలంగాణ ప్రభుత్వం సాయం అందించాలని మృతుడి బంధువులు కోరారు. కాగా, భువనగిరిలోని వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో వంశీరెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. ఎంఎస్ చేసే నిమిత్తం 2015లో అమెరికాకు వెళ్లాడు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసిన వంశీరెడ్డి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతను హత్యకు గురయ్యాడు.

  • Loading...

More Telugu News