: ఇదేనా మన భద్రత... హోం శాఖ వెబ్ సైట్ హ్యాక్


భారత సైబర్ భద్రతను ప్రశ్నిస్తూ, గుర్తు తెలియని హ్యాకర్లు కేంద్ర హోం శాఖ వెబ్ సైట్ ను హ్యాక్ చేయడం కలకలం కలిగించింది. రాజ్ నాథ్ సింగ్ నిత్యమూ స్వయంగా పర్యవేక్షిస్తుండే 'www.mha.nic.in' వెబ్ సైట్ ను హ్యాక్ చేయగా, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి దాన్ని బ్లాక్ చేశారు. ఏ విధమైన సమాచారమూ చోరీకి గురి కాకుండా చూసేందుకే సైట్ ను బ్లాక్ చేసినట్టు అధికారులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా దీన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు టెక్ నిపుణులు రంగంలోకి దిగినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, గడచిన నాలుగేళ్ల వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 700కు పైగా సైట్లను హ్యాకర్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక సాక్షాత్తూ హోం శాఖ వెబ్ సైటే హ్యాక్ కావడం మన సైబర్ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News