: రామ్ చరణ్ కొత్త చిత్రం టైటిల్ ‘మొగల్తూరు మొనగాడు’?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ విషయమై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘పల్లెటూరు ప్రేమలు’, ‘పల్లెటూరి మొనగాడు’ అనే టైటిళ్లు ప్రస్తావనకు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే, మెగాస్టార్ స్వగ్రామం అయిన మొగల్తూరు పేరు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ సినిమాకు ‘మొగల్తూరు మొనగాడు’ అనే టైటిల్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.