: రిసార్ట్ లో ఎమ్మెల్యేలను కలిసేందుకు పన్నీర్ సెల్వం నిర్ణయం!


అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్న శశికళకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను పన్నీర్ కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో రిసార్ట్ కు ఆయన వెళ్లనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని , తనకు అండగా నిలవాలని ఆయన కోరనున్నట్లు సమాచారం. కాగా, ఆ రిసార్ట్ లో మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో 20 మంది ఎమ్మెల్యేలు చిన్నమ్మపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. శశికళపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు పన్నీర్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.  

  • Loading...

More Telugu News