: ఎల్ఈడీ లైట్లలో, శరీర భాగాల్లో బంగారం దాచాడు!


బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త బాట పట్టారు. ఇందుకుగాను ఎల్ఈడీ లైట్లను వినియోగిస్తున్నారు. తాజాగా, జరిగిన ఓ సంఘటన ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సింగపూర్ నుంచి టైగర్ ఎయిర్ వేస్ విమానంలో నిన్న ఉదయం ఓ వ్యక్తి వచ్చాడు. అతని లగేజ్ ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసే క్రమంలో అతని వద్ద ఉన్న ఎల్ఈడీ లైట్లను పరిశీలించి చూశారు. ఆ లైట్ల మధ్యలో బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, అతని శరీర భాగాల్లో కూడా బంగారం బిస్కట్లను దాచి ఉంచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ఎల్ఈడీ లైట్లలో, శరీర భాగాల్లో దాచిన మొత్తం 12 బంగారు బిస్కెట్లు, రూ.59.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.   

  • Loading...

More Telugu News