: 400 దాటిన భారత్ లీడ్... స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన విజయ్, రాహుల్, కోహ్లీ
బంగ్లాదేశ్ తో హైదరాబాద్ లో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 687 పరుగులకు డిక్లేర్ చేసి, ఆపై బంగ్లాదేశ్ ను 388 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడుతూ, లీడ్ ను 400 పరుగులకు చేర్చింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో విజయ్ 7, రాహుల్ 10, కోహ్లీ 38 పరుగులకు అవుట్ అయ్యారు. వీరు భారీ స్కోరును చేయడంలో విఫలమైనప్పటికీ, సాధ్యమైనంత వేగంగా పరుగులను చేసే క్రమంలో అవుట్ అయ్యారు. ప్రస్తుతం పుజారా 34 పరుగులతో ఆడుతుండగా, రహానే క్రీజ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం భారత స్కోరు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు కాగా, లీడ్ 406 పరుగులు. టీ విరామం తరువాత భారత ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి, బంగ్లాదేశ్ 10 వికెట్లను రేపటిలోగా తీయాలన్నది భారత ఆలోచన.