: ఎన్నికల ప్రచారంలో ఉండగా కార్పొరేటర్ కు పురిటినొప్పులు !
ఎన్నికల ప్రచారంలో ఉన్న మహిళా కార్పొరేటర్ కు పురిటి నొప్పులు రావడంతో పండంటి మగ బిడ్డను ప్రసవించింది. పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం నిమిత్తం మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్)కు చెందిన సిట్టింగ్ కార్పొరేటర్ రూపాలీ పాటిల్ నిండు గర్భిణీ. ఎంఎన్ఎస్ అభ్యర్థినిగా వార్డు నెంబర్ 15 నుంచి బరిలోకి దిగిన ఆమె ఎన్నికల ప్రచారంలో శుక్రవారం పాల్గొంది. ఆమెకు పురిటినొప్పులు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చారు.