: నీ దెబ్బకు దిమ్మ తిరిగిపోయింది రాజా... ఐ లవ్ యూ: టీవీ9 జాఫర్ తో పోసాని కృష్ణమురళి
తెలుగు టీవీ చానల్ టీవీ9 నిర్వహించే 'ముఖాముఖి' కార్యక్రమంలో తాజా గెస్ట్ గా సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ కనిపించి, పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నాడు. తొలుత సాక్షి పత్రికలో తను, తన భార్య కుసుమలపై 'మనసున మనసై... పోసాని కుసుమై' అంటూ వచ్చిన ఆర్టికల్ ను ఫ్రేమ్ కట్టించుకుని దాచుకున్నానని చూపుతూ, 'దారి చూపిన దేవత...' అంటూ పాటపాడారు. పవన్ కల్యాణ్ తో సంబంధాలపైనా యాంకర్ జాఫర్ ప్రశ్నించారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సహనాన్ని కోల్పోయిన పోసాని, "నువ్వే క్వశ్చన్, నువ్వే ఆన్సర్ వేసుకో... అప్పుడు రెండూ ఒకటే" అంటూ విరుచుకుపడ్డట్టు, ఆ చానల్ కార్యక్రమం ప్రోమో ప్రసారంలో చూపుతోంది. చివరగా, నీ దెబ్బకు దిమ్మ తిరిగిపోయింది రాజా... ఐ లవ్ యూ అంటూ పోసాని వెళ్లిపోవడం కూడా కనిపించింది. ఈ ఇంటర్వ్యూ నేడు ప్రసారం కానుంది.