: భార్య విడిపోయేందుకు ఉబెర్ కారణమంటూ, రూ. 300 కోట్లు చెల్లించాలని కేసు!


తన భార్య విడాకులు ఇవ్వడానికి ఉబెర్ నిర్వాకమే కారణమంటూ, ఫ్రాన్స్ కు చెందిన ఓ వ్యక్తి రూ. 300 కోట్లు డిమాండ్ చేస్తూ దావా వేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, సాన్స్‌ లే సవోయిర్‌ అనే వ్యాపారి తరచుగా, ఉబెర్ క్యాబ్‌ లలో ప్రయాణిస్తుంటాడు. ఓసారి తన ఫోన్ నుంచి కాకుండా, తన భార్య ఫోన్ ఉపయోగించి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆపై అతని భార్య ఫోన్‌ కు నోటిఫికేషన్లు ప్రారంభమయ్యాయి. భర్త ఎక్కడ తిరుగుతున్నాడన్న సమాచారం మొత్తం ఆమెకు తెలిసిపోవడం మొదలైంది. యాప్ నుంచి లాగౌట్ అయినా, సాంకేతిక లోపాల కారణంగా నోటిఫికేషన్లు ఆగలేదు. దీంతో తన భర్త తిరుగుళ్లకు అలవాటు పడ్డాడని తెలుసుకున్న ఆమె, విడాకులు ఇచ్చింది. తన వ్యక్తిగత ప్రైవసీని ఉబెర్ యాప్‌ దెబ్బతీసిందని, ఆ కారణంగా తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఆరోపిస్తూ, 45 మిలియన్‌ డాలర్లు పరిహారం ఇవ్వాలని కేసు దాఖలు చేయగా, మరికొన్ని రోజుల్లో ఇది విచారణకు రానుంది. కాగా, ఈ కేసు గురించి ఉబెర్ ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News