: తన బట్టలూడదీశారని యువతి ఫిర్యాదు... మాజీ 'బిగ్ బాస్' పోటీదారు స్వామీ ఓంపై కేసు


పాప్యులర్ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్' మాజీ పోటీదారు స్వామి ఓం, ఆయన అనుచరుడు కలసి తనను వేధించారని, బట్టలూడదీశారని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ఢిల్లీ పరిధిలోని ఐపీ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు, ఈ నెల 7వ తేదీన స్వామి ఓం, ఆయన అనుచురుడు సంతోష్ ఆనంద్ లు ఆమెను లైంగికంగా వేధించారు. రాజ్ ఘాట్ ప్రాంతంలో నలుగురూ చూస్తుండగానే బట్టలూడదీశారు. బూతులు తిట్టారు. తాను అరిచి కేకలు పెడుతుంటే, అక్కడ చేరుతున్న వారి సంఖ్య పెరగడంతో స్వామి, ఆయన, అనుచరుడు పారిపోయారు. యువతి ఫిర్యాదుతో సెక్షన్ 354 కింద కేసు పెట్టి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ యువతికి, స్వామికీ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోందని తెలిసిందని అన్నారు.

  • Loading...

More Telugu News