: శశికళ కీలక ఎత్తు... జయ సమాధి వద్ద ఆమరణ దీక్ష!


గవర్నర్ విద్యాసాగర్ రావు కావాలనే తనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించిన వీకే శశికళ, తన పావులను వేగంగా కదుపుతున్నారు. చెన్నై, మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్ద ఆమె ఆమరణ నిరాహారదీక్షకు కూర్చోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పన్నీర్ సెల్వం రాజీనామా సమర్పించి, దాన్ని ఆమోదించిన తరువాత కూడా, నిబంధనల మేరకు శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తనను కాదని, ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఇప్పటికే శశికళ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇక కోర్టు కేసులు తనకు కొత్త కావని, జయలలిత ఉన్నప్పుడే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నానని, వాటి నుంచి ఎలా బయటపడాలో తనకు తెలుసునని తన వర్గం నేతల వద్ద శశి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కాగా, శశికళ నిరాహార దీక్ష రేపటి నుంచి ప్రారంభమవుతుందని పార్టీ నేత ఒకరు తెలిపారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆమె దీక్షకు కూర్చుంటే రాష్ట్రంలో నిరసనలు జరగవచ్చన్న అనుమానాలతో ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తును పెంచారు.

  • Loading...

More Telugu News