: మా వారు కనిపించడం లేదు... కాస్త వెతికి పెట్టండి!: తమిళనాడు వ్యవసాయ మంత్రి భార్య ఫిర్యాదు, కదిలిన పోలీసులు


తన భర్త, తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి దురైకన్ను కనిపించడం లేదంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన గత నాలుగు రోజులుగా కనిపించడం లేదని, ఫోన్ సైతం స్విచ్చాఫ్ వస్తుండటంతో తమకు ఆందోళనగా ఉందని పాపనాశం పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, దురైకన్ను శశికళ వర్గం నిర్వహిస్తున్న శిబిరంలో భాగంగా గోల్డెన్ బే రిసార్టులో ఉన్నారని కొందరు, ఆయన్ను ఏపీలోని ఓ రహస్య ప్రాంతానికి తరలించారని మరికొందరు భావిస్తున్నారు. దురైకన్ను కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయన ఎక్కడున్నారని సోదాలు జరుపుతామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. సాధ్యమైనంత త్వరగా ఆయన జాడను కనుగొంటామని ఓ అధికారి తెలిపారు. కాగా, తమను నాలుగు రోజుల పాటు క్యాంపు పేరిట బంధించి ఉంచడం పట్ల పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News