: ట్రంప్ అయితే మాకేంటి?.. మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియా
అమెరికాకు అధ్యక్షులు మారినా తమ విధానం మాత్రం మారబోదని ఉత్తర కొరియా నిరూపించింది. ట్రంప్ గద్దెనెక్కాక తొలిసారి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించి ట్రంప్ స్పందన కోసం ఎదురుచూస్తోంది. శనివారం ఉదయం 7:55 గంటలకు నార్త్ ప్యోంగ్యాంగ్ ప్రావిన్స్‌లోని బాంగ్యోన్ ఎయిర్ బేస్ నుంచి ఈ పరీక్ష నిర్వహించినట్టు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షిపణి పరీక్ష విజయవంతమైందని, 500 కిలోమీటర్ల దూరంలో జపాన్ సముద్రంలో పడిందని ఉత్తర కొరియా రక్షణ శాఖ తెలిపింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక ఉత్తర కొరియా నిర్వహించిన తొలి క్షిపణి పరీక్ష ఇదే. దీంతో ట్రంప్ తమ క్షిపణి పరీక్షపై ఎలా స్పందిస్తారోనని ఉత్తర కొరియా ఎదురుచూస్తోంది. అంతేకాదు అమెరికా అధ్యక్షుడి స్పందన తెలుసుకునేందుకే ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది.