: మరదలు శశికళ నుంచి కేసీఆర్‌కు ప్రాణహాని: టీపీసీసీ అధికార ప్రతినిధి రమ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఆయన మరదలు కుదురుపాక శశికళ నుంచి ప్రాణహాని ఉందని, కేసీఆర్ అన్న కుమార్తె, టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్య ఆరోపించారు. శనివారం రమ్య విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడులానే తెలంగాణలోనూ ‘కుదురుపాక’కు చెందిన కొందరు కోటరీగా ఏర్పడ్డారని ఆరోపించారు. వారివల్ల కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న కోటరీతోనే ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని, ముఖ్యమంత్రి భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఆమె కోరారు.