: పన్నీర్ సెల్వం మనుషుల నుంచి మాకు ప్రాణ హాని.. ఆరోపించిన ఇద్దరు ఎమ్మెల్యేలు


పన్నీర్ సెల్వం అనుచరుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వి.పన్నీర్ సెల్వం, మోహన్ ఆరోపించారు. కూవత్తూరు రిసార్ట్స్‌లో బస చేస్తున్న వారు మాట్లాడుతూ తాము రిసార్ట్స్‌లో ఉండడం వెనక ఎవరి ప్రోద్బలం లేదని పేర్కొన్నారు. తమను చంపేస్తామంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మనుషులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. పన్నీర్ ఏనాడూ జయకు విశ్వాసపాత్రుడిగా వ్యవహరించలేదని కలశపాక్కం ఎమ్మెల్యే వి.పన్నీర్ సెల్వం విమర్శించారు. రిసార్ట్స్‌లో తాము క్షేమంగానే ఉన్నామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని సెయ్యారు శాసనసభ్యుడు మోహన్ తెలిపారు.  గవర్నర్ త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News