: శత్రు క్షిపణులు గీత దాటితే ఇక తునాతునకలే.. ఇంటర్ సెప్టర్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది. గీత దాటే శత్రు క్షిపణులను తుత్తినియలు చేసే ఇంటర్ సెప్టర్ మిసైల్‌ను శనివారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్)కు చెందిన అబ్దుల్ కలాం ఐలండ్ నుంచి శనివారం ఉదయం 7:45 గంటలకు పరీక్షించారు. ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో ఇటువంటి క్షిపణి కలిగిన ఐదో దేశంగా భారత్ అవతరించింది. పరీక్షను విజయవంతంగా నిర్వహించడంపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. భూ వాతావరణం నుంచి 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని డీఆర్డీవో అధికారులు తెలిపారు.