: ‘జియో’ దెబ్బకు పదేళ్లలో తొలిసారి నష్టాలు చవిచూసిన ‘ఐడియా’


రిలయన్స్ జియో దెబ్బకు పదేళ్లలో తొలిసారి ఐడియా  సెల్యులార్ నష్టాలు మూటగట్టుకుంది. తొలిసారి త్రైమాసిక నష్టాలు ఆ సంస్థను కలవర పెడుతున్నాయి. డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసికంలో ఐడియా ఏకంగా రూ.384 కోట్లు నష్టపోయింది. గతేడాది ఇదే సమయంలో రూ.660  కోట్ల లాభాలు ఆర్జించిన ఐడియాకు ప్రస్తుత నష్టాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. జియో కారణంగా ఐడియా ఆదాయం 3.7 శాతం క్షీణించింది. ఐడియా నష్టాలకు జియో ఉచిత ఆఫర్లే కారణమని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News