: ‘వేద నిలయం’ను స్మారక చిహ్నంగా మార్చేందుకు చర్యలు ప్రారంభం!
చెన్నైలోని జయలలిత నివాసం వేదనిలయాన్ని స్మారక చిహ్నంగా మార్చాలని ఆమె అభిమానులు, అన్నాడీఎంకే నేతలు కోరడం, తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ మేరకు ఇటీవల ఒక ప్రకటన చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్యలు ప్రారంభమయ్యాయని, సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. దివంగత అన్నాడీఎంకే నేత ఎంజీఆర్ నివసించిన రామాపురంలోని గృహాన్ని కూడా స్మారక మందిరంగా గతంలో మార్చారు.