: శశికళ పరాజయం పాలవుతారు: మాజీ మంత్రి పొన్నయన్
తమిళనాడులో సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నశశికళ పరాజయం పాలవుతారని పన్నీర్ సెల్వంకు తాజాగా మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి పొన్నయన్ అన్నారు. జయలలిత అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను చూసేందుకు ప్రతిరోజూ అక్కడికి వెళ్లేవాడినని, అయితే, శశికళ అనుమతించేవారు కాదని అన్నారు. ‘అమ్మ’ జయలలితను ఎంతగానో గౌరవించే తాను చాలా నిరాశ చెందేవాడినని వాపోయారు. తమిళనాడు సీఎంగా పని చేసిన అనుభవం పన్నీర్ కు ఉందని, ఆయన నేతృత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా పొన్నయన్ అభిప్రాయపడ్డారు.