: ఏడు సినిమాల్లో నటించి రిటైర్ అవుదామనుకున్నా: పవన్ కల్యాణ్


ఏడు సినిమాల్లో నటించి రిటైర్ అవుదామని తాను మొదట్లో అనుకున్నానని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ విద్యార్థుల సదస్సు నిమిత్తం అమెరికా వెళ్లిన పవన్, నషువాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లో హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేయడం, డైలాగ్స్ చెప్పడం తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. ప్రజలకు చేరువగా ఉండటానికి దోహదపడే సినిమాలను తాను గౌరవిస్తానని, అందువల్లే సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. అయితే, నటుడిని కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, అసలు నటన అంటే తనకు నచ్చదని అన్నారు. మొదటి నుంచి కూడా సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకోవాలని ఉండేదని, రాజకీయాల్లోకి రావడం సాధారణంగానే ఉందని పవన్ చెప్పారు.

  • Loading...

More Telugu News