: జయలలిత ఆశయాలను కొనసాగించే శక్తి పన్నీర్ కే ఉంది... సీనియర్ నేత పొన్నియన్


తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఊహించని రీతిలో మలుపు తిరుగుతున్నాయి. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా,  సీనియర్ నాయకుడు పొన్నియన్ మద్దతు పలికారు. పన్నీర్ గూటికి ఎంపీలు అశోక్ కుమార్, పీఆర్ సుందరం చేరారు. ఈ సందర్భంగా పొన్నియన్ మాట్లాడుతూ, జయలలిత ఆశయాలను కొనసాగించే శక్తి పన్నీర్ కే ఉందని, శశికళ వర్గంలోని చాలా మంది ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని అన్నారు.

పన్నీర్, ఆయన వర్గంలోని చాలా మంది మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారని, తమినాడులోని రాజకీయ సంక్షోభానికి త్వరలో తెరపడనుందని అన్నారు. పన్నీర్ సెల్వంను జయలలిత నమ్మింది కాబట్టి మనమూ నమ్మాలని, ఆయనకు పగ్గాలు అప్పగిస్తేనే తమిళనాడుకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీలో సీనియారిటీతో పాటు రెండు సార్లు సీఎంగా చేసిన అనుభవం పన్నీర్ సెల్వంకు ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News