: శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించాలన్న సుబ్రహ్మణ్యస్వామి!
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావును బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కొంచెం సేపటి క్రితం కలిశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, శాసన సభా పక్ష నేత శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించాలని ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన ఒక వినతి పత్రాన్ని గవర్నర్ కు ఆయన అందజేశారు. కాగా, కొన్ని రోజులుగా శశికళకు మద్దతుగా సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతున్నారు.