: నువ్వా.. నేనా? అన్నట్లుగా తమిళ రాజకీయాలు.. పన్నీర్ వర్గంలో చేరిన మరో కీలక నేత
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో శశికళ నటరాజన్, పన్నీర్ సెల్వంల మధ్య పోరు నువ్వా.. నేనా? అన్నట్లుగా కొనసాగుతోంది. పన్నీర్ సెల్వంపై పై చేయి సాధించేందుకు భారీ వ్యూహాలతో ముందుకు వెళుతున్న శశికళ.. ఎమ్మెల్యేలతో భేటీ అవుతూ బిజీబిజీగా ఉండగా.. మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం కూడా అదే ఊపులో ఉంది. ఇప్పటికే శశికళకు హ్యాండ్ ఇచ్చి పన్నీర్ సెల్వం వద్దకు కొందరు పార్టీ నేతలు, మంత్రులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నేత పన్నీర్ చెంతకు చేరారు. అన్నాడీఎకేం సీనియర్ నేత సీ.పొన్నయ్యన్... పన్నీర్ సెల్వం నివాసానికి వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో పన్నీర్ వర్గంలో ఉత్సాహం మరింత పెరిగింది.