: రోజాను హైదరాబాద్ లో ఆమె ఇంటి వద్ద వదిలివెళ్లిన ఏపీ పోలీసులు
ఈ రోజు ఉదయం మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెను పోలీసు వాహనంలో ఎక్కించుకొని ఉదయం నుంచి తిప్పుతున్న పోలీసులు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నారు. నగరంలోని మణికొండలో ఉన్న రోజా ఇంటి వద్ద ఆమెను వదిలి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం రోజా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.