: తమిళనాడు సంక్షోభంపై స్పందించిన పుదుచ్చేరి సీఎం!
తమిళనాడులో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి స్పందించారు. తమ పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తాను పరిశీలిస్తున్నానని, అక్కడ నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ఓ నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్ కు ఉందని అన్నారు. సీఎం కుర్చీని ఆశిస్తున్న అభ్యర్థుల బల నిరూపణ అసెంబ్లీలోనే జరగాలి తప్పా, అందుకు, రాజ్ భవన్ వేదిక కాకూడదని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో కనిపిస్తున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గతంలో చాలా రాష్ట్రాల్లో చూశానని అన్నారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఇటీవల తలెత్తిన రాజకీయ సంక్షోభం గురించి ఆయన ప్రస్తావించారు.